For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా?: ఇలా చేయండి

By Nageswara Rao
|

చెల్లించాల్సిన ఆదాయపు పన్ను కన్నా ఎక్కువ చెల్లించారా? అయితే రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇలా చేయండి. ముందుగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిటర్నుల దాఖలు, ఇంటర్నెట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత రీఫండ్ చాలా తర్వగా రీఫండ్ అవుతోంది.

అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రిటర్నులు దాఖలు చేసినాన, ఈ వెరిఫికేషన్ చేసినా రిఫండ్ ఆలస్యం కావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా పన్ను చెల్లించిన వారు ముందుగా చూసుకోవాల్సిన విషయం ఐటీ రిటర్నులు సరిగానే సమర్పించామా? లేదా అని.

ఒకవేళ మీరు ఈ వెరిఫికేషన్ చేయకపోతే, వెంటనే అక్నాలజ్‌మెంట్‌ (రసీదు)ని సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్ (సీపీసీ), బెంగుళూరుకు పంపించాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియ పూర్తి చేసినట్లు అవుతుంది. దీంతో పాటు మీ బ్యాంకు ఖాతా సంబంధించిన సమాచారం అంతా సరిగ్గానే ఇచ్చారా లేదా అనేదీ సరి చూసుకోవాలి.

How to claim refund while filing income tax return

మీ ఐటీ రిటర్నుల ఫారాన్ని ఒకసారి పరిశీలించి, ఖచ్చితమైన వివరాలే ఇచ్చినట్లు ధ్రువీకరించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌లలో పొరపాటు ఉన్నట్లైతే, ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి మీ వివరాలను సరి చేసుకునే వెసులుబాటుని ఆదాయపు పన్ను విభాగం కల్పిస్తోంది.

అంతేకాదు ఐటీ రిఫండ్‌కు సంబంధించి మీ మొబైల్ నెంబర్‌కు ఏ సందేశం ఏం వచ్చింది... దాని అర్థం ఏమిటి? ఏం చేయాలి అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. దాన్ని బట్టి తగిన సమాధానాలు ఇస్తేనే మీ రిఫండ్ మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

English summary

ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా?: ఇలా చేయండి | How to claim refund while filing income tax return

Have you failed to reporting some tax saving investment to your employer or did you make the investment after submitting your investment declaration to the employer? Then there is a possibility of you being eligible for a tax refund.
Story first published: Wednesday, February 3, 2016, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X