For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి: ఎందుకంటే..!

By Nageswara Rao
|

'స్టాక్ మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారు ఎందుకు?' సాధారణంగా అందరూ అడిగే ప్రశ్ని ఇది. మార్కెట్లో మదుపు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే అందులో పెట్టుబడి పెడుతుంటారు. సాధారణంగా స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలంలో ఈక్విటీల్లోనే అధిక రాబడులను ఆర్జిస్తుంటాయి.

కాబట్టి కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడులు పెడుతుంటే వారిని ఇందులో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తుంటారు. ఈక్విటీల్లో రాబడి ఆర్థిక వ్యవస్థ పనితీరు, మార్కెట్‌ సెంటిమెంటు, కంపెనీల వార్తలు, అంతర్జాతీయ పరిణామాలు తదితర వాటిపై ఆధారపడి ఉంటుంది.

స్వల్ప, మధ్య కాలాల్లో కాస్తంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ... దీర్ఘకాలం కొనసాగితే లాభాలను గడిస్తారు. ఉదహరణకు ఈక్విటీల్లో పెట్టుబడులను 20 ఏళ్లపాటు కొనసాగిస్తే.. 12.9శాతం వృద్ధి రేటుతో పెట్టిన పెట్టుబడి 11.3 రెట్లు వృద్ధి చెందితే, అదే ఎఫ్‌డీల్లో 2.9రెట్లు మాత్రమే వృద్ధి చెందింది.

అంతేకాదు నష్టాన్ని భరించగలిగే సామర్థ్యం ఆధారంగా మన పొదుపు, మదుపులు ఎక్కువ భాగం అధిక రాబడులను సంపాదించే పథకాలకు కేటాయిస్తే, భారీ ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడం, సంపదను సృష్టించుకోవడం చాలా తేలిక. ఉదాహరణకు స్టాక్‌ మార్కెట్లో నమోదైన షేర్లను కొనుగోలు చేసినప్పుడు వాటిని అమ్మి వెంటనే నగదుగా మార్చుకునే వీలుంటుంది.

అదే స్థిరాస్తి, బంగారంలో ఇది కాస్తంత కష్టంతో కూడుకున్న పని. పైగా షేర్లలో లావాదేవీలన్నీ తక్కువ ఖర్చుకే పూర్తవుతాయి. వంద రూపాయల కనీస మొత్తంతో కూడా షేర్లలో పెట్టుబడితో ప్రారంభించొచ్చు. షేర్లలోమదుపు చేస్తున్నామంటే ఒక వ్యాపారంలో భాగస్వాములం అవుతున్నామని గుర్తుంచుకోవాలి.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి

స్టాక్ మార్కెట్లో మదుపు చేసేప్పుడు మంచి యాజమాన్యం ఉన్న సరైన కంపెనీని ఎంచుకొని, షేర్లు అందుబాటు ధరల్లోకి వచ్చినప్పుడు కొనుగోలు చేయాలి. కనీసం 4 నుంచి 5 రంగాలకు సంబంధించిన 8 నుంచి 10 కంపెనీల్లో పెట్టుబడులు ఉండేలా చూసుకోవచ్చు.

 స్టాక్ మార్కెట్లో పెట్టుబడి

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి

ఆదాయం కూడా వస్తుంది. మంచి కంపెనీల్లో మదుపు చేసినప్పుడు అవి ఆర్జించే లాభాల్లో కొంత వాటాను డివిడెండు రూపంలో పెట్టుబడులు పెట్టిన వారికి అందిస్తాయి. అంతేకాదు షేర్లలో మదుపు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అయితే, వీటిలో నష్టభయం కూడా అధికంగా ఉంటుందని మర్చిపోకూడదు.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి

అయితే దీర్ఘకాలంలో పెట్టిన పెట్టుబడులకపై ఇది పెద్దగా నష్టభయాన్ని కలగజేయదు. దీర్ఘకాలంలో పూర్తి అవగాహనతో, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. షేర్లను క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నాకే మదుపు చేయడం శ్రేయస్కరం. ఒకవేళ మీరు షేర్లను అర్ధం చేసుకొని పరిస్థితి ఉంటే డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవాలి.
 స్టాక్ మార్కెట్లో పెట్టుబడి

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి

వీటిని మార్కెట్‌ నిపుణులు నిర్వహిస్తారు కాబట్టి, షేర్లతో పోలిస్తే నష్టభయం తక్కువగా ఉంటుంది. మార్కెట్‌ ఏ స్థాయిల్లో ఉందో పట్టించుకోకుండా షేర్లలో క్రమం తప్పకుండా మదుపు చేయడం, లేదంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో 'సిప్‌' మార్గాన్ని ఎంచుకొని, దీర్ఘకాలంలో కొనసాగితే ఓ మంచి మదుపరిగా విజయవంతమవుతారు.

English summary

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి: ఎందుకంటే..! | 6 reasons for investing in the stock market

Waiting for the best time to invest in the stock market? Maybe when you have some extra money lying around and the inevitable question arises: Should you keep lighting cigars with hundred dollar bills or, what the heck, plunk some money into the market?
Story first published: Wednesday, January 20, 2016, 15:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X