For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

By Nageswara Rao
|

హైదరాబాద్: షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్, షోరూమ్స్‌ లాంటివాటిల్లో వినియోగదారుడు ప్రతిసారి క్రెడిట్ కార్డుపై కొనుగోళ్లు జరిపినప్పుడు ఆయా సంస్ధలు ప్రత్యేకంగా రివార్ట్ పాయింట్లను ప్రకటిస్తుంటాయి. ఈ రివార్డ్ పాయింట్లను తదుపరి కొనుగోళ్ల సందర్భంలో రిడీమ్ చేసుకోవచ్చు.

అసలు ఈ రివార్డ్ పాయింట్ల వల్ల వినియోగదారుడుకి ఉపయోగం ఉందా? లేకపోతే క్రెడిట్ కార్డు సంస్ధలు ఆఫర్ చేసిన రివార్డ్ పాయింట్ల వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది? వీటిని సరైన సమయంలో ఉపయోగించుకోకపోతే ఏమవతుంది? చూద్దాం.

క్రెడిట్ కార్డులను అనేక రకాల కొనుగోళ్లకు వినియోగదారులు ఉపయోగిస్తుంటారు. దీనిని వినియోగించి చేసే ప్రతి కొనుగోలుపై కొన్ని రివార్డు పాయింట్లను క్రెడిట్ కార్డు కంపెనీలు అందిస్తుంటాయి. వినియోగదారుడు ఖర్చు చేసిన మొత్తాన్ని బట్టి రివార్డ్ పాయింట్లు ఆధారపడి ఉంటాయి.

ఈ రివార్డ్ పాయింట్లు అనేవి తీసుకున్న కార్డు, కంపెనీని బట్టి జమవుతాయి. వీటిని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో వినియోగించుకోవచ్చు. లేకపోతే నగదు రూపంలో కూడా రిడీమ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఛారిటీకి బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

రివార్డు పాయింట్లు ఇవ్వడం వల్ల క్రెడిట్ కార్డు కంపెనీలకు ఏం లాభం అనేది చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపిన సందర్భంలో షాపు యజమానులు ఇంటర్ ఛార్జి కింద బ్యాంకులకు కొంత మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

దీంతో పాటు వార్షిక ఫీజులు సైతం వసూలు చేస్తాయి. అంతేకాదు క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై చెల్లింపుల్లో ఆలస్యం అయితే కార్డు దారులు చెల్లించే వడ్డీలు సైతం బ్యాంకులకు లాభాలే కదా. షాపు యజమానుల దగ్గర నుంచి బ్యాంకులకు వచ్చిన రాబడినే సాధారణంగా కస్టమర్లకు రివార్డ్ పాయింట్ల రూపంలో బ్యాంకులు ఇస్తుంటాయి.

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఆ కార్డు వినియోగంపై వచ్చే రివార్డు పాయింట్లు, బ్యాంకు వసూలు చేసే ఛార్జిల వివరాలను తెలుసుకోవాలి. రివార్డ్ పాయింట్లు ఎక్కువగా ఇచ్చే కంపెనీలు చెల్లింపుల్లో ఆలస్యం అయితే రుసుమును భారీగా విధిస్తాయి.

 క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

అంతేకాదు రివార్డ్ పాయింట్లను నిర్దేశిత కాలంలో వినియోగించుకోకపోతే వాటికి కాలం చెల్లిపోతుంది. ఈ నేపథ్యంలో రివార్డ్ పాయింట్ల విషయంలో కంపెనీ అనుసరించే విధానం గురించి ముందుగా కస్టమర్ తెలుసుకుంటే మంచిది.

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం?

రివార్డు పాయింట్లు అధికంగా వస్తాయని ఒక కంపెనీ కార్డుని ఎంచుకోవడం మంచిది కాదు. కొనుగోళ్లను ప్రోత్సహించడానికి కంపెనీలు రివార్డ్ పాయింట్లతో ఆకర్షిస్తాయి. క్రెడిట్ కార్డును సరైం క్రమంలో వినియోగించకపోతే వినియోగదారుడికి తడిసి మోపడవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డును తరచూ వినియోగిస్తూ సకాలంలో చెల్లింపులు చేస్తే రివార్డు పాయింట్ల వల్ల ప్రయోజనం కలుగుతుంది. క్రెడిట్ కార్డుని సకాలంలో వినియోగించుకుని, చెల్లింపులు ఆలస్యం చేయకుండా ఉండే వినియోగదారుడికి మేలు జరుగుతుంది.

English summary

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల వల్ల ఉపయోగం? | Benefit from credit card reward points

Rachita wanted to introduce her father to the marvels of a Smartphone by buying him one. The most affordable price she could get one cost Rs. 7,500. She decided to purchase the phone by redeeming the credit card points she had redeemed over the last two years. Rachita was not a compulsive shopper but preferred swiping her card to pay as much as possible.
Story first published: Monday, November 30, 2015, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X