For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయాన్ని పెంచి, మరింత డబ్బు సంపాందించడం ఎలా?

By Nageswara Rao
|

చాలా మందికి తాము సంపాదిస్తున్న ఆదాయాన్ని పెంచడంతో పాటు, మరింత డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తుంటారు. ఇందుకు గాను బ్యాంకు డిపాజిట్లు, చిన్న మొత్తాల పథకాలను ఎంచుకుంటారు. మరికొంత మంది రిస్క్ చేసి ఈక్విటీల్లో నేరుగా లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధపడతారు.

డబ్బు వృద్ధి చెందేలా చేయడం, మెరుగైనా రాబడుల కోసం ప్రత్యామ్నామ మార్గాలపై దృష్టి సారించాలి. ఇటీవలే ఆర్‌బీఐ రెపోరేటును అరశాతం తగ్గించిన నేపథ్యంలో బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇళ్ల రుణాలు, కార్ల రుణాలు తీసుకునేవారికి ఇది శుభవార్తే.

తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్మును భద్రంగా ఉంటుందని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే వారి పరిస్థితి ఏమిటి? బ్యాంకులు రుణాలపై మాత్రమే కాకుండా డిపాజిట్లపై వడ్డీరేట్లను కూడా తగ్గించనున్నాయి. అంతేకాదు చిన్నమొత్తాల పథకాలకు సంబంధించిన వడ్డీరేట్లను కూడా ప్రభుత్వం తగ్గించాలని చూస్తోంది.

బ్యాంకులు డిపాజిట్‌ రేట్లను తగ్గిస్తున్న క్రమంలోనే పిపిఎఫ్‌, పోస్టాఫీస్‌ డిపాజిట్‌ స్కీమ్‌, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సమృద్థి స్కీమ్‌పై చెల్లిస్తున్న వడ్డీ రేట్లను ప్రభుత్వం తగ్గించడం ఖాయమమంటున్నారు.

ఆర్‌బీఐ నిర్ణయంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణాలు తీసుకునే వారికి వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. అయితే డబ్బు పొదుపు చేసే వారికే ఇబ్బంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి. ఈ క్రమంలో చిన్న ఇన్వెస్టర్లు, తాము సంపాదించిన కష్టార్జితాన్ని కొంచెం ఎక్కువ రాబడి లభించేవిధంగా ఎలా పొదుపు చేయాలనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

చిన్నమొత్తాల్లో పొదుపు మంచిదే

చిన్నమొత్తాల్లో పొదుపు మంచిదే

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్ల తగ్గింపు పరిశీలనలో ఉందన్నారు. అయితే ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో వెల్లడించలేదు. బ్యాంకులు ఎఫ్‌డి రేట్లను తగ్గించడం మాత్రం ఖాయం. అందువల్ల రిస్క్‌ను ఏ మాత్రం ఇష్టపడని వారు ఈ లోపుగానే మంచి రాబడులను ఇచ్చే చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లను పరిశీలించడం మంచిది. సేవింగ్స్‌ ఖాతాల్లో మిగులు నిల్వలున్నవారు, ఎఫ్‌డిల కాలపరిమితి ముగిసిన వారు, రేట్లు తగ్గేలోపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

సెక్యూర్డ్‌ డిబెంచర్లు, బాండ్లు

సెక్యూర్డ్‌ డిబెంచర్లు, బాండ్లు

మంచి రేటింగ్‌ ఉన్న కంపెనీలు జారీ చేసే ఫుల్లీ సెక్యూర్డ్‌ డిబెంచర్లు, బాండ్లను కూడా చిన్న ఇన్వెస్టర్లు దృష్టిలో ఉంచుకోవచ్చు. కొన్ని మంచి రేటింగ్‌ ఉన్న కార్పొరేట్‌ సంస్థలు డిపాజిట్లను సమీకరిస్తుంటాయి. అలాంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మెరుగైన రాబడులను పొందవచ్చు. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ కోసం చేస్తుంటే, టాక్స్‌ సేవింగ్‌ బాండ్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి.

బంగారంలో పెట్టుబడి

బంగారంలో పెట్టుబడి

మొన్నటివరకూ బంగారంలో పెట్టుబడి ఎంతో భద్రం. కానీ ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న బంగారం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికీ బంగారం ధరలు కుదురుకోలేదు. అందువల్ల బంగారంలో ఇన్వె్‌స్టమెంట్‌ రిస్క్‌తో కూడినదిగా మారింది. బంగారంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇన్వెస్టర్లలో ఇప్పటికీ భయం కనిపిస్తోంది.

రియల్‌ ఎస్టేట్‌

రియల్‌ ఎస్టేట్‌

రియల్‌ ఎస్టేట్‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వెస్ట్ చేసే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రియల్టీ ఫండ్స్‌ను కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. తక్కువ మొత్తంలో వాటి ద్వారా లేదా ఎక్కువ మొత్తం సొమ్ము చేతుల్లో ఉంటే నేరుగానే రియల్టీలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీర్ఘకాలికంగా మంచి రాబడులు ఇస్తున్న రంగాల్లో ఇదొకటి.

 రిస్క్ తీసుకుంటే ఈక్విటీల్లో లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌

రిస్క్ తీసుకుంటే ఈక్విటీల్లో లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌

నిపుణుల సలహాతో ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈక్విటీల్లో కూడా నేరుగా లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసేందుకు అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి దీర్ఘకాలిక దృష్టితో మాత్రమే స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయాలి. రెండో ఆప్షన్‌‌గా మ్యూచువల్‌ ఫండ్స్‌. రిస్క్‌ వద్దనుకుంటే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌, డెట్‌ ఫండ్స్‌, లిక్విడ్‌ ఫండ్స్‌, అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

English summary

ఆదాయాన్ని పెంచి, మరింత డబ్బు సంపాందించడం ఎలా? | How to Increase Your Income and Make More Money

If you want to be the best and learn how to become a millionaire, you must first find out what the top people do and then do it yourself.
Story first published: Monday, October 5, 2015, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X