For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

By Nageswara Rao
|

చిన్న మొత్తంలో సంపాదించే ఉద్యోగులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతుంటారు. అంతేకాదు ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టే పెట్టుబడులు అత్యంత సురక్షితమైనవి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీర్ఘకాలంతో పోలిస్తే ఫిక్సెడ్ డిపాజిట్లు మిగతా వాటితో ఎక్కువ సంపదను సృష్టించడంలో వెనుకబడి ఉంటాయి.

ఇందుకు కారణం ఫిక్సెడ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం ద్రవ్యోల్బణంతో పోలిస్తే తక్కువగా ఉండటమే. గడచిన గత రెండేళ్ల కాలంలో భారత్‌లో ద్రవ్యోల్బణం సరాసరిన 9.76 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో ఫిక్సెడ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీని అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

అంతేకాదు ఫిక్సెడ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలపై పన్ను కూడా చెల్లించాల్సి ఉండటంతో 7 శాతానికి మించి డబ్బు పెరగదు. ఈ కారణంగానే ఫిక్సెడ్ డిపాజిట్లపై పెట్టే పెట్టుబడులు ఆధిక సంపదను సృష్టించ లేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

ఉదహారణకు ఈరోజుల్లో రూ. లక్ష ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత ఆ మొత్తం రూ. 3.83 లక్షలు ( ఏడాదికి 7 శాతం రాబడితో) అవుతుంది. అదే డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టే రూ. లక్ష కాస్త రూ. 5.11 లక్షలు(8.5 శాతం రాబడితో) అవుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

అదే గనుక ఈ రూ. లక్షను ఈక్విటీ మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే రూ. 13.44 లక్షలు (14 శాతం రాబడి, 8 శాతం ద్రవ్యోల్బణంతో) అవుతుంది. అంతేకాదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడిపై వచ్చే వడ్డీకి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?

ఇలా కాకుండా మీరు ఫిక్సెడ్ డిపాజిట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే, అమలులో ఉన్న పన్ను స్లాబ్ ఆధారంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్లే దీర్ఘకాల సంపద సృష్టికి ఫిక్సెడ్ డిపాజిట్ల కన్నా మ్యూచువల్ ఫండ్స్ మేలని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని? | Why you shouldn't invest in a fixed deposit

Among some of the best practices followed by top investment managers, tax emerges as an important aspect to be considered. It is common to see advisors in the West talking about pre-tax returns, and more importantly, post-tax returns.
Story first published: Thursday, September 3, 2015, 13:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X