For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

11 మార్గాలు: దొంగ నోట్లను కనిపెట్టండిలా?

By Nageswara Rao
|

ఇటీవల కాలంలో తరచూ పోలీసులు దొంగనోట్ల ముఠాను గుట్టు రట్టు చేశారంటూ వస్తున్న వార్తలను మనం చాలానే చూశాం. అంతేకాదు భారత్‌లో దొంగనోట్లను ముద్రించే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. దీంతో ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది.

ముఖ్యంగా 500, 1000 రూపాయల దొంగ నోట్లను మాత్రమే ముద్రిస్తున్నారు. బ్యాంకులో మీరు నగదు లావాదేవీలు నిర్వహించేటప్పుడు మీ నోట్లు సరైనవా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరువకూడదు. ఈ నేపథ్యంలో దొంగనోట్లకు అసలు నోట్లకు మధ్య ఉన్న తేడా ఎంటో చూద్దాం.

11 Ways To Identify Fake Rs 500 Notes In India

1. రిజిస్టర్

రూ. 500 నోటుపై పైన పేర్కొనబడిన వాటర్ మార్క్‌ని ముందుగా మీరు గమనించాల్సి ఉంది. లైట్ వెలుతురులో మీరు చూసినట్లైతే అక్కడ మీకు రూ. 500 నెంబర్ కనిపిస్తుంది.

2. వాటర్ మార్క్

లైట్ వెలుతురులో మీరు పైన పేర్కొనబడిన ఖాళీ ప్రదేశంలో చూసినట్లైతే అక్కడ దాగి ఉన్న మహాత్మాగాంధీ బొమ్మ కనిపిస్తుంది. అంతేకాదు అక్కడ ఎలక్ట్రోటైప్ రూపంలో 500 నెంబర్ కూడా కనిపిస్తుంది.

3. ఇంక్ మార్క్

మీ రూ. 500 నోటుని ఒక యాంగిల్‌లో పెట్టి చూసినట్లైతే పైన కనిపిస్తున్న గ్రీన్ కలర్ 500 నెంబర్ బ్లూ ఇంక్‌లో కనిపిస్తుంది.

4. కాంతిలో

500 నోట్ కింది భాగాన ముద్రించబడిన నోట్ నెంబర్ అతినీలలోహిత కాంతికి గురైనప్పుడు మెరుస్తుంది.

5. ఆర్‌బీఐ భద్రతా తీగ

నోట్ మధ్య భాగంలో ఉన్న భద్రతా దారంలో భారత్, ఆర్‌బీఐ అని ఉంటుంది. ఒక యాంగిల్‌‌లో నోటుని పెట్టి చూసినప్పుడు అది ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది.

6. ఆర్‌బీఐ సీల్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రతో పాటు 'Paanch sau rupiye' అని సిరాతో ముద్రించబడి ఉంటుంది.

7. గుప్త చిత్రం

రూ. 500 నోటుకు కుడివైపున అంటే గాంధీ చిత్రం వెనుక భాగాన కంటితో దగ్గరగా పరిశీలిస్తే 500 నెంబర్ కనిపిస్తుంది.

8. చిన్న చిన్న అక్షరాలు

మహాత్మా గాంధీ చిత్రం, నిలువుగా ఉన్న గీతకు మధ్య ఆర్‌బీఐ, 500 నెంబర్ ఉంటుంది.

9. గుర్తు

రూ. 500 నోటును చూడగానే గుర్తించేందుకు ఎడమైవైపు భాగాన ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్‌ను చేతితో తాకవచ్చు.

10. ఏ సంవత్సరంలో ముద్రించబడింది

మీ దగ్గర ఉన్న నోటు ఏ సంవత్సరంలో ముద్రించబడిందో కూడా తెలిసిపోతుంది.

11. రిజిస్టర్

ఎడమవైపున ఏ విధంగానైతే డిజైన్ ఉంటుందో కుడి వైపున కూడా అదే విధంగా డిజైన్ ఉంటుంది.

English summary

11 మార్గాలు: దొంగ నోట్లను కనిపెట్టండిలా? | 11 Ways To Identify Fake Rs 500 Notes In India

A fake note is any note which does not possess the characteristics of genuine Indian currency note. While receiving banknotes, it is better have the habit of checking the genuineness of the notes. Here are a few ways in which you can check fake currency notes
Story first published: Monday, September 14, 2015, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X