For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏయే ఆర్ధిక లావాదేవీల్లో పాన్‌కార్డు తప్పనిసరి

By Nageswara Rao
|

భారత్‌లో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు తప్పనిసరి. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేటప్పుడు పాన్ నెంబర్ తప్పనిసరి. పన్ను చెల్లించే వ్యక్తి వివిధ పెట్టుబడులు, రుణాలు, మదింపు ఇతర వ్యాపార కార్యకలాపాలు పాన్ నెంబర్ ఆధారంగానే సాధ్యమవుతుంది.

ఆదాయ పన్ను శాఖ ప్రకారం అన్ని విభాగాల్లోనూ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయపు పన్ను చెల్లించడానికి గాను పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (పాన్) కార్డు తప్పనిసరి. అనేక ఆర్ధిక లావాదేవీలకు పాన్ కార్డు ఎంతో అవసరం. వీటితో పాటు చాలా చోట్ల తప్పనిసరిగా పాన్ కార్డు అవసరం ఉంటుంది. పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (పాన్) ఎక్కువగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో తెలుసుకుందాం.

13 Financial Transactions Where Quoting PAN is Mandatory

ఈ క్రింది పరిస్థితులలో పాన్ కార్డు తప్పనిసరి:
* ఒక బ్యాంకు ఖాతా తెరవడానికి
* రూ 50,000 బ్యాంకు డిపాజిట్ కోసం.
* డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతా తెరవడానికి
* రూ 50,000 మించి డిమాండ్ డ్రాఫ్ట్ కోసం.
* రూ 50,000కు మించి చెక్ డిపాజిట్ చేసే సందర్బంలో
* భారతదేశంలో ఏదైనా ఆస్తి అమ్మడానికి మరియు కొనుగోలు చేసే సందర్బంలో
* కార్ల కొనుగోలు లేదా అమ్మకాలు.
* రూ 25,000 కంటే ప్రయాణ ఖర్చుల కోసం నగదు చెల్లింపులు చేసే సందర్బంలో
* ఆదాయపు పన్ను శాఖ టిడీఎస్ రిటర్న్ కోసం
* మీరు ఒక రుణ తీసుకుంటున్న సందర్బంలో: హోమ్ / వ్యక్తిగత / ఇతర
* క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు కోరుతూ బ్యాంకుని సంప్రదించినప్పుడు
* రూ. 50లకు మించి షేర్లను కొనుగోలు చేసే సందర్భంలో లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేసే సందర్భంలో

పాన్ కార్డు లేని వ్యక్తి పైన పేర్కొన్న లావాదేవీలను నిర్వహించాలంటే అతను తప్పనిసరిగా ఫామ్ నెంబర్ 60ని సమర్పించాల్సి ఉంటుంది. (వ్యవసాయ ఆధారిత నగదు వస్తున్న వ్యక్తి ఫామ్ నెంబర్ 61 సమర్పించాలి.)

English summary

ఏయే ఆర్ధిక లావాదేవీల్లో పాన్‌కార్డు తప్పనిసరి | 13 Financial Transactions Where Quoting PAN is Mandatory

A Permanent Account Number (PAN) Card is compulsory in India for a number of transactions. Quoting PAN is necessary as it enables the department to link all transactions of the assessee with the tax department.
Story first published: Tuesday, August 11, 2015, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X