For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సూరెన్స్ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లించకుంటే ఏం చెయ్యాలి?

By Nageswara Rao
|

రాము ఓ ప్రముఖ బీమా కంపెనీ నుంచి పాలసీని తీసుకున్నాడు. మెచ్యూరిటీ పూర్తి అయినా సదరు కంపెనీ రాము జమ చేసిన మొత్తంతో పాటు బోనస్‌ను ఇచ్చేందుకు సమయం వెళ్లదీసింది. చాలా రోజులు తమ ఆఫీసు వెంట తిప్పుకున్న తర్వాత పాలసీదారుడైన రాముకి మొత్తాన్ని చెల్లించింది.

ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ రాబోయే రోజుల్లో బీమా కంపెనీలు పాలసీదారుల విషయంలో ఇక ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించే వీలు లేదు. బీమా పాలసీల విషయంలో గానీ, బీమా కంపెనీలు అందిస్తోన్న సేవల విషయంలో గానీ పాలసీదారుడుకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు వెంటనే బీమా కంపెనీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.

పాలసీదారుడు చేసిన ఫిర్యాదుని కంపెనీ తక్షణమే పరిశీలనకు చేపట్టాలి. అంతేకాదు నిర్దిష్ట సమయంలో పాలసీదారుడుని సమాధానం చెప్పాల్సి ఉంది.

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

పాలసీదారుడు ఫిర్యాదు అందిన వెంటనే మూడు వర్కింగ్ డేస్‌లో సంబంధిత బీమా కంపెనీ ఆ ఫిర్యాదును ఎలా పరిష్కరించనున్నది, దాన్ని పరిష్కరించే పని ఏ అధికారి చేపడుతున్నది, ఆ అధికారి హోదా ఏమిటి వంటి వివరాలు పాలసీదారుడుకు తెలియచేయాల్సి ఉంది.

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

అలాగే ఫిర్యాదు అందిన తేదీ నుంచి గరిష్ఠంగా రెండు వారాల్లోగా ఆ ఫిర్యాదును పరిష్కరించి తీరాలి. ఒక వేళ ఫిర్యాదును తిరస్కరిస్తే, ఆ రెండు వారాల గరిష్ఠ పరిమితికి లోబడే ఎందుకు ఫిర్యాదును తిరస్కరిస్తున్నది కారణాలతో సహా పాలసీదారుడు తెలియజేయాలి.

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

ఇందులో ఎలాంటి జాప్యం జరిగినా, బీమా కంపెనీ తమ ఫిర్యాదును పరిశీలనకు చేపట్టకపోయినా అలాంటి పాలసీదారుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ ఐఆర్‌డిఎఐకి చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌ 155255కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

 బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

బీమా అంబుడ్స్‌మన్‌లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పని చేస్తున్నారు. వారికి జ్యుడిషియల్‌ అధికారాలుంటాయి. 20 లక్షల రూపాయల లోపు కేసులను వారు పరిశీలించి పరిష్కరిస్తారు. ప్రధానంగా నష్టపరిహారానికి చెందిన కేసుల్లో అంబుడ్స్‌మన్‌లు రంగంలోకి దిగుతారు.

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

బీమా కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడాన్ని నిరాకరిస్తే ఏం చెయ్యాలి?

పాలసీదారులు తమ ఫిర్యాదుల పరిష్కారానికి వినియోగదారుల ఫోరమ్‌లను కూడా ఆశ్రయించవచ్చు. ఇప్పటివరకు ఇవి ఎన్నో కేసులను సమర్థవంతంగా పరిష్కరించాయి. అయితే ఫోరమ్‌కు వెళ్లే ముందు పాలసీదారుడు తన ఫిర్యాదును బీమా కంపెనీకి లిఖితపూర్వకంగా అందచేసినట్టు ఆధారాన్ని కలిగి ఉండాలి. బీమా కంపెనీకి లేఖ రాసిన 30 రోజుల తర్వాత పాలసీదారులు ఫోరమ్‌ను ఆశ్రయించవచ్చు.

English summary

ఇన్సూరెన్స్ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లించకుంటే ఏం చెయ్యాలి? | What can I do when my insurer refuses to pay for a claim?

Remember, insurance companies don't like to deviate from their standard policy for anybody. One-size-fits-all coverage is a lot easier for them. Your goal is to get them to forget about their standard policy and to deal with you as an individual.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X