For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలా?

By Nageswara Rao
|

భారత్‌లో ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో దాని ప్రాముఖ్యత చాలా పెరిగింది. 12 అంకెలు కలిగిన ఈ ఆధార్ నెంబర్‌తో ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంకింగ్, ఫోన్ కనెక్షన్స్ లాంటి సేవలకు కూడా ప్రజలు వినియోగించుకున్న సంగతి తెలిసిందే.

దేశ వ్యాప్తంగా ఆధార్ నెంబర్ ఒక ఐడెంటిటీలాగా కూడా ఉపయోగపడుతుంది. మీరు గనుక మీ ఆధార్ కార్డుని పోగొట్టుకున్నా లేదా తప్పుగా ఉన్న మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా తిరిగి పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

ఇటీవల కాలంలో ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌, ఓటర్ ఐడీతో అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్‌కు మీ ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవడం ద్వారా మీకు లభించే గ్యాస్ సబ్సిడీని నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోనే జమ అవుతుండటం విశేషం.

How to Know Whether Aadhaar Number is Linked to Bank Account Or Not?

మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలా?

స్టెప్ 1: మీ మొబైల్ నుంచి *99*99*# నెంబర్‌కు డయల్ చేయండి
స్టెప్ 2: స్క్రీన్‌పై మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను నమోదు చేయండి.
స్టెప్ 3: పంపించండి
స్టెప్ 4: సరైన ఆధార్ నెంబర్ అయితే నిర్ధారించండి లేదా తప్పు నెంబర్ అయితే మళ్లీ నిర్ధారించేందుకు 2 నొక్కండి
స్టెప్ 5: బ్యాంక్ అకౌంట్‌తో మీ ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా అనే విషయం మీకు తెలియజేస్తుంది.

English summary

బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలా? | How to Know Whether Aadhaar Number is Linked to Bank Account Or Not?

Aadhaar is a 12 digit individual identification number which will serve as a proof of identity and address, anywhere in India.
Story first published: Thursday, July 30, 2015, 11:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X