For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి?

By Nageswara Rao
|

నగదు లావాదేవీల కోసం బ్యాంకు అకౌంట్ తరహాలోనే స్టాక్ మార్కెట్‌లోని షేర్ల క్రయవిక్రయాల కోసం ఉపయోగించే అకౌంట్ డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్. భారత్‌లో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, కొటక్ సెక్యూరిటీస్ లాంటి బ్రోకరేజ్ సంస్ధలు డీమ్యాట్ అకౌంట్లను అందిస్తున్నాయి.

స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించాలంటే డీమ్యాట్ అకౌంట్ ఎంతో కీలకం. స్టాక్ మార్కెట్‌లో షేర్లు అమ్మడం, కొనడం నగదుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాచ్ అకౌంట్ అవసరం.

షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా

షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా

ఆన్‌లైన్‌లో షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసినటువంటి షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచేందుకు గాను డీమ్యాట్ అకౌంట్ అవసరం. భారత్‌లో బ్యాంకింగ్, బ్రోకరేజ్ సేవలు అందించే సంస్ధలు ఈ మూడింటిని త్రీ ఇన్ వన్ అకౌంట్‌గా కూడా అందిస్తున్నాయి.

 విడిగా డీమ్యాచ్ అకౌంట్

విడిగా డీమ్యాచ్ అకౌంట్

కొన్ని బ్రోకరేజ్ సంస్ధలు ప్రత్యేకించి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఇస్తున్నాయి. ఈ సందర్భంలో బ్యాంక్ అకౌంట్ తీసుకుని, దానిని వీటికి అనుసంధానం చేసుకోవాలి.

 డీమ్యాట్ అకౌంట్‌లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు

డీమ్యాట్ అకౌంట్‌లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు

షేరు అమ్మినా, కొనుగోలు చేసిన ప్రతిసారి బ్రోకరేజి చార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఈ బ్రోకరేజి ఛార్జీ ఫిక్స్‌గా ఉంటుంది లేదంటే మీరు నిర్వహించిన లావాదేవిలో ఇంత శాతమని ఉంటుంది. ఉదాహరణకు బ్రోకరేజి ఛార్జి 0.5 శాతం అనుకుంటే, మీరు రూ. 100 విలువ చేసే స్టాక్స్ కొన్న ప్రతిసారీ 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.

డీమ్యాట్ అకౌంట్‌కు వార్షిక చార్జీలు వసూలు

డీమ్యాట్ అకౌంట్‌కు వార్షిక చార్జీలు వసూలు

బ్రోకరేజి సంస్ధలు అందించిన సర్వీసులను బట్టి వార్షికంగా రూ. 500 నుంచి రూ. 2,000 వరకు ఛార్జిని వసూలు చేస్తుంటాయి. వీటితో పాటు డీమ్యాచ్ ఛార్జీలు (షేర్లను పేపర్ సర్టిఫికెట్ రూపంలో ఉంటే వాటిని డీమ్యాట్ రూపంలోకి మార్చేందుకు), సలహా ఫీజులు, ట్రేడింగ్ ఫీజులని వినియోగాన్ని బట్టి వసూలు చేస్తుంటాయి.

English summary

డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? | All you should know about Demat account & KYC norms

Shares and securities are held in dematerialised form in demat account. It is mandatory to have a demat account to carry out a transaction in stock exchange. Once an account is opened, you can buy shares by visiting a broker personally or online.
Story first published: Tuesday, July 28, 2015, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X