For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న మదపర్లకు సరళ్ ట్రేడింగ్ అకౌంట్, తెరవడం ఎలా?

By Nageswara Rao
|

బెంగుళూరు: షేర్ల కొనుగోలుకు అవసరమైన డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను మరింత సులభంగా ప్రారంభించే అవకాశం రిటైల్ ఇన్వెస్టర్ల‌కు ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ (సెబీ) నిర్ణయం తీసుకుంది.

దీని కోసం దరఖాస్తు పత్రాలను సరళీకరించడంతో పాటు, నివాస ధ్రువీకరణ పత్రాల సమర్పణ ప్రక్రియను కూడా సులభతరం చేసింది. ప్రభుత్వ రంగ సంస్ధల్లో వాటాలను విక్రయిస్తుండటంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్ల‌ను ఈక్విటీ మార్కెట్లకు ఆకర్షించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.

ఇందు కోసం 'సరళ్ ట్రేడింగ్ అకౌంట్' ప్రక్రియకు సెబీ శ్రీకారం చుట్టింది. మార్కెట్‌కు కొత్తగా వచ్చే రిటైల్ ఇన్వెస్టర్ల‌ు నగదుతోనే షేర్ల కొనుగోలుకు దరఖాస్తు చేస్తుంటారు. వీరికి ఇంటర్నెట్ ట్రేడింగ్, మార్జిన్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్, పవర్ ఆఫ్ అటార్నీ ప్రక్రియను వినియోగించే అవసరం ఉండదు.

 What is SARAL Account For Trading in Shares? How to Open it?

సరళ్ ఖాతా అంటే ఏమటి?

షేర్ల కొనుగోలు, అమ్మకాలు చేపట్టేందుకు వీలుగా సరళీకరించిన ఖాతా ప్రారంభ పత్రమే 'సరళ్ ఆఫ్'. దీని పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని సరళ ఖాతా అంటారు. స్టాక్ ఎక్సేంజ్‌లు, బ్రోకరేజీ సంస్ధల వెబ్‌సైట్‌ల నుంచి కూడా ఈ పత్రాన్ని డౌన్ లౌడ్ చేసుకోవచ్చు.

సరళ్ ఖాతా ప్రారంభించాక, మరిన్ని సేవలు పొందాలంటే, కావాల్సిన అదనపు సమాచారాన్ని సమర్పించాల్సి ఉంది.

సరళ్ ట్రేడింగ్ ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు?

* చిరునామా ధ్రువీకరణ కోసం నివాస/తపాలా చిరునామా/శాశ్వత చిరునామా ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సరిపోతుంది.

* ఒకవేళ ధ్రువీకరణ పత్రంలోని చిరునామాలో నివసించకపోతే, అతనికి ఏ చిరునామాలో లేఖలు, వివరాలు అందించాలో తెలిపే చిరునామా తీసుకోవాలి.

* ఇందుకు ధ్రువీకరణ ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఈ చిరునామా నుంచి మారితే, రెండు వారాల్లోపు తెలియపరచాల్సి ఉంటుంది.

English summary

చిన్న మదపర్లకు సరళ్ ట్రేడింగ్ అకౌంట్, తెరవడం ఎలా? | What is SARAL Account For Trading in Shares? How to Open it?


 
 The problem for small investors and those that are trading in stocks, is that they keep hearing the Sensex hitting new highs and people making money, but, do not know how to invest in the stock markets themselves.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X