For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టూ వీలర్ పోయిందా, ఈ జాగ్రత్తలు పాటించండి...!

By Nageswara Rao
|

నరేష్ ఒక మధ్య తరగతి ఉద్యోగి. ఇంటిలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో తన బండిని ఇంటి ముందే నిలిపి ఉంచాడు. తెల్లవారే సరికే బండి మాయం. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటి బారిన మీరు పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రతల్లు పాటించాల్సి ఉంది. అవేంటో తెలుసుకుందాం.

వాహనానికి పరికరాలను అమర్చండి:

వాహనాన్ని దొంగలు ఎప్పుడూ ఏ వాహనాన్ని ఎత్తుకెళదామా అనే దృష్టితోనే ఉంటారు. కాబట్టి, ఎప్పటికప్పుడు మన వాహనాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి దొంగతనాన్ని నివారించే పరికరాలను టూవీలర్స్, కార్లలో అమర్చుకోవాలి. ఈ పరికరాలను యాంటీ థెప్ట్ అలారం అంటారు. ఈ పరికరాలను అమర్చుకోవడం వల్ల దొంగలు వాహనాన్ని టచ్ చేస్తే చాలు అలారం మోగుతుంది.

How to Claim on Your Motorbike Insurance

పార్కింగ్ ప్లేసులోనే వాహనాన్ని నిలపాలి:

నగరంలోని చాలా దుకాణాల్లో ఈరోజుల్లో పెయిట్ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సాధ్యమైనంత వరకు దీన్ని వినియోగించుకోవాలి. ఈ చిన్నపాటి డబ్బు కట్టేందుకు తప్పించుకొని సురక్షితం లేని ప్రాంతంలో బండి నిలిపితే అది మీకే నష్టాన్ని కలిగిస్తుంది. అదే మీరు గనుక పెయిట్ పార్కింగ్‌‌లో పార్క్ చేసినట్లేతే మీ వాహనం సురక్షితం. కొన్ని సందర్బాల్లో మీ వాహనం గనుక చోరికి గురైనట్లైతే, అక్కడున్న వారిని ప్రశ్నించడం లేదా సీసీ కెమెరాల్లో పరిశీలించడం లాంటివి చేయవచ్చు.

ఇన్సూరెన్స్ తప్పనిసరి:

చాలా మంది వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు పూర్తి స్దాయి బీమా పాలసీని తీసుకోరు. దీనిక బదులుగా చట్టబద్దంగా తప్పనిసరైన థర్డ్ పార్టీ పాలసీని ఎంచుకుంటారు. దీని వల్ల మీరు చెల్లించే ప్రీమియంలో కొంత మొత్తాన్ని మిగుల్చుకుంటారు. దొంగతనం, ప్రమాదంలాంటివి జరిగినప్పుడు నష్టానికి ఎలాంటి పరిహారం అందదు. అదే పూర్తి స్ధాయి బీమా తీసుకున్నప్పుడు నిర్ణీత కాలంలో వాహనం దొరక్కపోతే వాహన విలువ ప్రకారం నష్ట పరిహారం అందుతుంది.

వాహన పత్రాలు మీ వద్దే ఉంచుకోండి:

వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన రిజిస్టేషన్ పేపర్లు, ఇన్సూరెన్స్ పత్రాలు బైకులోనే ఉంచుతారు. ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు. ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి వాటిని మీ వద్ద ఉంచుకోవాలి. ఒకవేళ మీరు గనుకు మీ వాహనంలో పత్రాలు ఉంచుకోవాల్సి వస్తే జిరాక్స్ తీసి వాటిని ఉంచుకుంటే మంచిది.

English summary

టూ వీలర్ పోయిందా, ఈ జాగ్రత్తలు పాటించండి...! | How to Claim on Your Motorbike Insurance

In most cases, making a claim on your motorbike insurance should be straightforward.
Story first published: Wednesday, March 25, 2015, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X