For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు: సేవింగ్స్, శాలరీ అకౌంట్స్ మధ్య తేడా

By Nageswara Rao
|

బెంగుళూరు: చాలా మందికి శాలరీ అకౌంట్‌, సేవింగ్స్ అకౌంట్ మధ్య తేడాలు పెద్దగా తెలియవు. ఎందుకంటే రెండు అకౌంట్లు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. కానీ వాటి గురించి తెలిసిన వారు మాత్రం రెండు అకౌంట్లు వేరుగానే భావిస్తారు. అసలు శాలరీ అకౌంట్‌, సేవింగ్స్ అకౌంట్‌కి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం

శాలరీ అకౌంట్: పేరులో ఉంది దీని అర్ధం. సాధారణంగా ఉద్యోగమిచ్చిన వాడు లేదా యజమాని ఉద్యోగికి శాలరీ ఇచ్చేందుకు ఉపయోగించే అకౌంట్‌నే శాలరీ అకౌంట్ అంటారు. ఈ అకౌంట్‌లో కంపెనీనే స్వయంగా ఉద్యోగికి అందేలా చూస్తుంది. అంతే కాదు ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అంటే జీరో బ్యాలెన్స్‌గా అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ అకౌంట్స్ కేవలం శాలరీస్ అందుకునే ఉద్యోగుల కోసమే రూపొందించబడ్డాయి.

కొన్ని బ్యాంకులు ఉద్యోగులు అందుకునే శాలరీని బట్టి వివిధ రకాల అకౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ అకౌంట్‌లో మీరు నిల్వ ఉంచిన నగదుకు ఎలాంటి వడ్డీ రాదు. ఈ శాలరీ అకౌంట్స్ వల్ల ఉద్యోగస్తులకు చాలా తేలికగా క్రెడిట్ కార్డులు లభిస్తాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. వరుసగా మూడు నెలలు పాటు మీకు గనుకు శాలరీ అకౌంట్‌లో జమ అవ్వకపోతే ఈ అకౌంట్‌ సేవింగ్స్ అకౌంట్‌గా మారుతుంది.

Difference Between Salary Account and Savings Account (SB Account) In A Bank

సేవింగ్స్ అకౌంట్:

సేవింగ్స్ ఖాతాను ఎవరైనా తెరవొచ్చు. ఈ ఖాతా ముఖ్య ఉద్దేశం నగదు దాచుకోవడమే. ఈ ఖాతలో మీరు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచిన దాన్ని బట్టి వివిధ రకాలైన సేవింగ్స్ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. మీరు గనుకు మినిమమ్ బ్యాలెన్స్‌ను కొనసాగించనట్లేతే, బ్యాంకులు మీకు జరిమానా విధిస్తాయి. మీ సేవింగ్స్ ఖాతాను శాలరీ ఖాతాగా కూడా మార్చుకునే వెసులుబాటుని బ్యాంకులు కల్పిస్తున్నాయి.

Salary account Savings account
Who can Open Employer Anyone
Purpose Credit of salary To encourage Savings
Minimum Balance No Minimum Balance Minimum Balance Required
Convertibility If the salary is not credit for 3 consecutive months, it is considered as savings account One can convert to salary account , if the bank allows
Interest rates No Interest paid 4%-6% interest is paid

ముగింపు: తక్కువ కాలంలో ఎవరైతే ఎక్కువ ఉద్యోగులు మారుతుంటారో వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. జాబ్ మారి అకౌంట్‌ను క్లోజ్ చేయకపోతే, మూడు నెలలు తర్వాత అది

సేవింగ్స్ ఖాతాగా మారుతుంది. ఆ తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాంకులు జరిమానా విధిస్తాయి.

English summary

బ్యాంకు: సేవింగ్స్, శాలరీ అకౌంట్స్ మధ్య తేడా | Difference Between Salary Account and Savings Account (SB Account) In A Bank

Most of working people have wondered, how salary account can be different from savings account. Because at a glance both have same features. However, they both are different accounts.
Story first published: Tuesday, March 31, 2015, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X