For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల పొదుపు ఖాతాలు

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: నగదు లావాదేవీలు నిర్వహించడానికి మనం బ్యాంకుకు వెళుతుంటాం. ఐతే బ్యాంకులో వివిధ రకాలైన బ్యాంకు ఖాతాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా కస్టమర్ వయసు, సంపాదనను బట్టి బ్యాంకులో వివిధ రకాలైన ఖాతాల ఓపెన్ చేయిస్తుంటారు.

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్

పేరులోనే ఈ ఖాతా ఎవరికోసమో తెలుస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన వారికోసం ప్రత్యేకంగా ఈ ఖాతాను బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్‌కు ప్రభుత్వ బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తున్నాయి.

* మహిళా పొదుపు ఖాతాలు

మహిళల కోసం ప్రత్యేంగా కొన్ని బ్యాంకులు ఈ ఖాతాలను అందిస్తున్నాయి. మహిళల ఆర్థిక అవసరాలు, పెట్టుబడి మరియు జీవనశైలి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు ఈ ఖాతాలను ప్రవేశపెట్టాయి. ఈ పొదుపు ఖాతాలకు కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన ప్రయోజనాలు అధిక ఉపసంహరణ పరిమితి అందిస్తున్నాయి.

* సాధారణ సేవింగ్ అకౌంట్స్

సాధారణ పొదుపు ఖాతా ఎవరైనా తెరవవచ్చు. ఈ ఖాతాల్లో క్వార్టర్లీకి కొంత మొత్తం నిల్వ ఉంచాల్సి ఉంటుంది. అలా నిర్వహించిన పక్షంలో బ్యాంకులు పెనాల్టీ వసూలు చేసే అవకాశం ఉంది.
సాధారణ పొదుపు ఖాతా లావాదేవీల పుస్తకం, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, పుస్తకం సౌకర్యం మరియు డెబిట్ కార్డులు లాంటి లక్షణాలను అందిస్తుంది.

What are Different Types of Bank Accounts?

* నో ఫ్రిల్ సేవింగ్ అకౌంట్స్

నో ఫ్రిల్ సేవింగ్స్ ఖాతా కలిగిన వ్యక్తులు కనీస బ్యాలెన్స్ ప్రమాణం లేదా చాలా తక్కువ కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ సూచన ప్రకారం ఎక్కువ మంది చేరుకోవడానికి దీన్ని ప్రవేశపెట్టారు. అయితే, నో ఫ్రిల్ ఖాతా నిర్దిష్ట పరిమితులతో బ్యాంకు నుండి బ్యాంకు మారుతుంటుంది.

* స్టూడెంట్ సేవింగ్స్ ఖాతా

కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ స్టూడెంట్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. ఈ ఖాతా కనీస బ్యాలెన్స్ లేదా చాలా తక్కువ సంతులనంతో నిర్వహించాల్సి ఉంటుంది.

* ఎన్నారై కోసం ప్రత్యేక అకౌంట్స్

ఎన్నారైల కోసం ప్రత్యేకించి కొన్ని బ్యాంకులు ఖాతాలను అందిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

* ఎన్ఆర్ఈ సేవింగ్స్ అకౌంట్

ఈ ఖాతాలో రూపాయి తెగలతో నిర్వహించబడుతుంది. భారత జాతీయతను దృష్టిలో పెట్టుకుని వ్యక్తులు అందించిన సమాచారం మేరకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పేర్లతో ఖాతాలో ఓపెన్ చేయవచ్చు.

* ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్

ఎన్ఆర్ఓ పొదుపు ఖాతాలు కరెంట్, సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనుసంధానం చేయబడి రూపాయి తెగలతో నిర్వహించబడుతుంది. ఈ ఖాతాను నివాసితులు సంయుక్తంగా నిర్వహించవచ్చు. భారత్‌లో నివసిస్తున్న వారు కూడా ఈ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్‌లోకి నగదును బదిలీ చేయవచ్చు.

English summary

బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల పొదుపు ఖాతాలు | What are Different Types of Bank Accounts?

With the advancement in banking technology, many banks are offering tailor made products to suit individual needs. While accounts may differ from bank to bank their purpose remain the same.
Story first published: Tuesday, January 27, 2015, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X