For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ రాలేదా..? ఇలా చేయండి

By Nageswara Rao
|

హైదరాబాద్: మార్చి వచ్చిందంటే చాలు మంది పన్ను ఆదాల గురించే ఆలోచిస్తుంటారు. చెల్లించాల్సిన మొత్తం కన్నా ఆదాయపు పన్ను ఎక్కువగా చెల్లించి, కొంత మంది రిపండ్ కోసం ఎదురు చూస్తుంటారు. అసలు మనకు రావాల్సిన రిఫండ్ వచ్చిందో రాలేదో తెలుసుకోవడం ఎలాగో చూద్దాం.

మొదట మీరు నిజంగానే చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ చెల్లించారా లేదా అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం ఫామ్ 26ఏఎస్‌ను అలాగే ఫామ్ 16ను సరిపోల్చాలి. సాధారణంగా రిఫండ్ రెండు పద్దతుల్లో వస్తుంది. మొదటిది నేరుగా బ్యాంకు ఖాతాలోకి జయ చేయడం. రెండోది ఇంటి చిరునామాకు చెక్కు పంపడం.

రిటర్నలు దాఖలు చేసేటప్పుడు మీ బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్‌సీ కోడు, బ్యాంకు బ్రాంచి వివరాలు సరిగ్గా పేర్కొవాలి. వీటిలో తప్పులుంటే రిఫండ్ రాదు. ఇక రిఫండ్ రావాల్సిన వారు బ్యాంకు వివరాలతో పాటు, సరైన ఇంటి చిరునామాను ఇవ్వాలి.

How to check the status of tax refund by Income Tax Department

సరైన చిరునామా ఇవ్వకపోడవం వల్ల చెక్కు తిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వెబ్ సైట్‌లో చూస్తే తెలుస్తుంది. రిఫండ్ పరిస్ధితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ వెబ్ సైట్‌ను అందిస్తుంది.

రిఫండ్‌ సమర్పించే సమయంలో ఏ విధంగా రిఫండ్ అందుకోవాలనుకుంటున్నారో మీరు స్పష్టంగా తెలియజేయాలి. మీరు సమర్పించిన వివరాలతోనే రిఫండ్ పరిస్ధితిని తెలుసుకోవచ్చు. రిఫండ్ కు సంబంధించిన అన్ని విషయాల్ని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా చూస్తుంది. కొన్ని సార్లు మీకు చెక్ పంపినా అందదు. కానీ వెబ్ సైట్‌లో చెక్కును ఖాతాలో జమ చేసినట్లు చూపిస్తుంది.

ఇలాంటి సమయంలో వెంటనే ఆదాయపు పన్ను శాఖకు ఆ వివరాలను తెలియజేయండి. పాన్ కార్డు ఆధారంగా కింద ఉంచి వెబ్‌సైట్ లోకి లాగిన్ అయి రిఫండ్‌కు సంబంధించిన వివరాలు చెక్ చేసుకోండి.

https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html

English summary

ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ రాలేదా..? ఇలా చేయండి | How to check the status of tax refund by Income Tax Department

How to check the status of tax refund by Income Tax Department in India.
Story first published: Friday, January 30, 2015, 12:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X