For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్‌లో డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడం ఎలా?

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ఆధార్‌కార్డు పోయిందని చింతిస్తున్నారా... ఇక పోయినదాని గురించి బయపడవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతాలకు సైతం ఆధార్‌ను అనుసంధానం చేశారు. దీంతో ప్రతి ఒక్కరికి అవసరమైన నేపథ్యంలో ప్రతి మండల కేంద్రంలో మీ సేవా కేంద్రాల్లో శాశ్వత ఆధార్ కేంద్రాలను నెలకొల్పి ఆధార్ నమోదు చేసి కార్డులను అందజేస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలైన పక్కాగృహాలు, పింఛన్లు, రుణమాఫీ, రేషన్‌కార్డుతో పాటు నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు వంటివి సైతం పొందేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి అన్నారు. దీంతో ప్రభుత్వం అన్నింటికీ ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేశారు.

ఇప్పటికే ఆధార్‌కార్డు పొందినటువంటివారు పొరపాటున ఎక్కడైన పోగొట్టుకున్నా చిరిగిపోయినా కనీసం కార్డునెంబర్ తెలియకపోయినప్పటికీ ఆన్‌లైన్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంది. ఆధార్ కార్డు పోగొట్టుకోన్నప్పుడు తర్వాతి ప్రత్యామ్నాయం నమోదు సంఖ్య, మీ నమోదు సంఖ్య మీ దగ్గర ఉన్నట్లయితే సులభంగా ఆధార్ కార్డు తిరిగి పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో మీ నమోదు సంఖ్య, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను ఇవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నమోదు సంఖ్య, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను కూడా పోగొట్టుకొంటే , ఆధార్ కార్డు రిజిస్టర్ కేంద్రం దగ్గరకు వెళ్లి మీ పేరు, చిరునామాతో వెతికి పొందవచ్చు.

How to Apply for Duplicate or Lost Aadhaar Card online?

ఆన్ లైన్‌లో నకిలీ ఆధార్ కార్డు లేదా పొగొట్టుకున్న ఆధార్ కార్డు కోసం ఈ పద్ధతిని అనుసరించండి.

* ఆధార్ డౌన్‌లోడ్ చేయదలచుకున్నవారు గెట్ ఈ-ఆధార్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఈ-ఆధార్‌తో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది.

* అక్కడ కనిపించే వివరాలను నమోదు చేసి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, గెట్ వన్ టైమ్ పాస్‌వర్డ్ అని ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* కొన్ని సెకన్ల తర్వాత మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల తో కూడిన ఓటీపీ పాస్‌వర్డ్ మెసేజీ రూపంలో వస్తుంది. ఆ నెంబర్‌ను ఎంటర్ ఓటీపీ అనే బాక్సులో నమోదు చేసి వాల్యూడేగట్ అండ్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* అనంతరం డౌన్‌లోడ్‌తో కూడిన ఫైల్ కనిపిస్తుంది. అందులో ఓపెన్, సేవ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. కావలసిన వారు సేవ్ ఆప్షన్‌ను క్లిక్ చేసిన వెంటనే పాస్‌వర్డ్ అడుగుతుంది.

* అక్కడ మీ పోస్టల్ పిన్‌కోడ్‌ను ఎంటర్ చేసి ఓకే చేసిన వెంటనే మీ ఆధార్‌కార్డు కనిపిస్తుంది. ఆధార్‌కార్డుతో అవసరమైన పనిని చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.

English summary

ఆన్‌లైన్‌లో డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడం ఎలా? | How to Apply for Duplicate or Lost Aadhaar Card online?


 Do not panic if you have lost your Aadhaar card, there is a way to apply for another. However, one needs to be careful with card as it contains all the necessary details to harm your financial data.
Story first published: Wednesday, January 28, 2015, 12:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X