For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ అంటే ఏమిటి?

|

What is transfer pricing?
ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ (బదిలీ విలువ) అనేది ఒక యంత్రాంగం లేదా బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీస్) పన్నుల చెల్లింపులను తప్పించుకునేందుకు రూపొందించుకున్న ఓ విధానం. ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న పలు కంపెనీలు తమకు వచ్చిన లాభాలను పన్నులు విధించే రేటు ఏ దేశంలో తక్కువగా ఉంటుందో.. ఆ దేశానికి మళ్లించుకుంటాయి. అందువల్ల వాటిపై పడే పన్ను భారం తగ్గిపోతుంది. వివిధ దేశాల్లో కార్యకలాపాలు సాగించే సంస్థలకే ఈ విధానం సాధ్యపడుతుంది.

భారత ప్రభుత్వ ఆదాయ పన్నుశాఖ ప్రకారం ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ అంటే సంబంధిత పార్టీల మధ్య జరిగే కార్యకలాపాల ప్రైస్ లేదా విలువ. ఒకే గ్రూపులోని కంపెనీలు తమ మధ్య కార్యకలాపాలను, కనిపించని ఆస్తులతోపాటు భౌతిక ఆస్తుల బదిలీల వల్ల ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ జరుగుతుంది. ఈ విధంగా బదిలీ చేయడం ద్వారా ఒకే గ్రూపులోని సంస్థలు పన్నుల ఎగవేతకు పాల్పడతాయి.

ఉదాహరణ: తమ కంపెనీకి విధించే పన్ను భారాన్ని తగ్గించుకోవాలనే కంపెనీలు ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌కు పాల్పడతాయి. ఉదాహరణకు X అనే కంపెనీ ఎక్కువ పన్ను రేటును కలిగి ఉంది. అయితే తన లాభాలను పెంచుకుంటూ పన్ను భారాన్ని మాత్రం తగ్గించుకోవాలని కోరుకుంటుంది. ఇలాంటి కంపెనీలు ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేస్తాయి. అదేలా అంటే తన దగ్గరి సరుకును (గూడ్స్)ను అదే గ్రూపులోని Y కంపెనీకి (ఎక్కడైతే పన్ను రేటు తక్కువగా ఉంటుందో) ఒకే ధర రూ. 100కి పంపిస్తుంది. X కంపెనీ పంపించిన సరుకును Y కంపెనీ రూ. 400కు అమ్మకం చేపడుతుంది. ఈ విధంగా తన దగ్గరి వస్తువులను పన్ను రేటు తక్కువగా ఉన్న ఇతర దేశాలలోని తన గ్రూపులోని సంస్థల ద్వారా అమ్మకాలు జరపడం ద్వారా పేరెంట్ కంపెనీ X లాభాలను పొందుతుంది. తక్కువ పన్నులతోనే ఆ కంపెనీ రూ. 300 లాభాన్ని పొందుతుంది.

రొటేషనల్ ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్

కంపెనీలు తమ కార్యకలాపాలను నియంత్రించుకోవడం ద్వారా లాభాలను ఆర్జించాలని చూస్తుంటాయి. (అందువల్ల 60 శాతం తమ కార్యకలాపాలను తమ సంబంధిత కంపెనీల ద్వారా కొనసాగిస్తాయి). అందువల్ల అవి పన్ను ఎగవేతతో లాభాలను పొందుతాయి. పన్నులు తక్కువగా ఉన్న చోట తమ కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగించడం వల్ల పన్ను రూపంలో చెల్లించాల్సిన మొత్తాలను కంపెనీలు తగ్గించుకుంటాయి.

పన్ను విధానంలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకునే కంపెనీలు తమ లాభాలను రెట్టింపు చేసుకునేందుకు ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే కట్టుదిట్టంగా ఇలాంటి విధానాలు అమలు చేయకుంటే భారీ మూల్యమే చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల వొడాఫోన్, మరో బహుళజాతి సంస్థ షెల్ ఇండియా మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, యూరప్‌లో అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ రాయల్ డచ్ షెల్ పిఎల్‌సి కంపెనీలు ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ విధానంతో భారత పన్నుల శాఖ నుంచి పలు సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

English summary

ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ అంటే ఏమిటి? | What is transfer pricing?

Transfer pricing is a mechanism or mode by which several MNCs attempt to evade tax. In the process, companies operating globally, shift profits earned in a particular nation to other where the rate of taxation is way below, this is usually executed by undertaking or executing transactions within the group companies.
Story first published: Friday, February 28, 2014, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X