Author Profiles

Senior Sub Editor
జర్నలిజంలో నేను నా ప్రయాణాన్ని ఈనాడు గ్రూప్ కు చెందిన ఈటీవీ భారత్ తో ప్రారంభించాను. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్ లో కంటెంట్ ఎడిటక్ గా కెరియర్ ప్రారంభించాను. అక్కడ పొలిటికల్, ప్రాంతీయ వార్తలు రాశాను. తరువాత Tv-9 గ్రూప్ కు సంబంధించిన పర్సనల్ ఫైనాన్స్ యాప్ Money-9 కోసం సబ్ ఎడిటర్ గా పనిచేశాను. అదే సమయంలో Tv-9 డిజటల్ వెబ్ కోసం బిజినెస్, జాతీయ, అంతర్జాతీయ, హెల్త్ వార్తలను రాశాను. ఇప్పుడు గుడ్ రిటర్న్స్ వెబ్ కోసం సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్స్, ఇన్వెస్ట్ మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి అంశాలపై వార్తలు రాస్తున్నాను.
నాపేరు పావని. టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన నేను ఆ తర్వాత పలు వెబ్‌సైట్‌లకు ఫ్రీలాన్సర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ కోసం ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నాను. పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్స్, ఇన్వెస్ట్ మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి అంశాలపై వార్తలు రాస్తున్నాను.
Reporter and Sub Editor
2018 జర్నలిస్ట్ గా చెక్కిళ్ల శ్రీనివాస్ ప్రయాణం మొదలైంది. తర్వాత ఈనాడు జర్నలిజంలో చేరి ఈటీవీ భారత్ కంటెంట్ ఎడిటర్ గా పని చేశారు. తర్వూత టీవీ9లో సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టి అక్కడ రాజకీయాలు, స్పోర్ట్స్, బిజినెస్ డెస్క్‌లో పనిచేశారు. 2022 జూలైలో వన్ ఇండియా తెలుగులో రిపోర్టర్, సబ్ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలతో పాటు స్పోర్ట్స్ కూడా కవర్ చేస్తూ స్పోర్ట్స్ క్రిటిక్‌గా కూడా ఉన్నారు.
సీనియర్ సబ్ ఎడిటర్
2000లో జర్నలిస్ట్ గా కేరీర్ ఆరంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా ఇఎంఎస్, వార్త, సూర్య, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో సిటీ బ్యూరో, స్టేట్ బ్యూరో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను. 2016లో తొలిసారిగా డిజిటల్ మీడియా ప్లాట్ ఫాంపై అడుగు పెట్టాను. బెంగళూరు కేంద్రంగా న్యూసు డిజిటల్ మీడియా - తెలుగు, పబ్లిక్ టీవీ డిజిటల్ మీడియా- తెలుగులో సీనియర్ ప్రొడ్యూసర్ గా పనిచేశాను. 2019 నుంచి ODMPLలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను.
Senior Sub Editor
డాక్టర్ .ధరణికోట వీణావాణి తెలుగులో పీహెచ్. డి, జర్నలిజంలో పీజీ చేశారు. 14 సంవత్సరాలుగా జర్నలిజంలో రాణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా తాను సాగించిన ప్రయాణంలో ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 2004 లో జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి నేటివరకు వివిధ ఛానల్స్ లో పని చేశారు. సాక్షి టీవీ లో డిస్ట్రిక్ట్ కరస్పాండెంట్ గా, 93.5 రెడ్ ఎఫ్.ఎంలో ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గానూ, జెమినీ న్యూస్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందిస్తారు. జర్నలిజం పట్ల అంకిత భావంతో పని చేసే వీణావాణి నిస్పక్షపాతంగా వార్తా విశ్లేషణలు అందించటమే కాక వివిధ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు సైతం చేసిన అనుభవం వుంది. బెస్ట్ జర్నలిస్ట్ గా పలు మార్లు అవార్డులను అందుకున్న డాక్టర్ . వీణావాణి ఎలాంటి వార్త అయినా పారదర్శకంగా ఇస్తారు. చక్కని భాషా నైపుణ్యంతో పాటు, సమగ్ర విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉన్న డాక్టర్ వీణావాణి వార్తల్లో ప్యూరిటీ, కథనాల్లో క్లారిటీ వుంటుంది. 2019 నుంచి ODMPLలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Associate Editor
Kannaiah is the Associate Editor with ODMPL News channel. He follows exclusive stories and breaking news. He had worked with Mahaa news,V6 news and Raj news. He has 10+ years of overall experience in the news industry.2010లో మహాన్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా జర్నలిస్టు రంగంలో ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, అనలైటికల్ స్టోరీలు రాశాను. మహాన్యూస్‌, వీ6 న్యూస్,రాజ్ న్యూస్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 2018 జూన్ నెలలో వన్‌ ఇండియాలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా చేరిన నేను ప్రస్తుతం అసోసియేట్ ఎడిటర్‌ హోదాలో ఉన్నాను.
సీనియర్ సబ్‌ ఎడిటర్
రాజశేఖర్ గర్రెపల్లి 2013 నుంచి తెలుగు‘ODMPL’లో పని చేస్తున్నారు. 2009 నుంచి ఈయన మీడియా రంగంలో ఉన్నారు. గతంలో ఈటీవీ-2, జీ-24గంటలు న్యూస్ ఛానళ్లలో పనిచేశారు. ప్రస్తుతం తెలుగు‘ODMPL’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, జాతీయ, అంతర్జాతీయ వార్తలను, ఆసక్తికర కథనాలను అందిస్తుంటారు.2018 నవంబర్‌లో వ్యక్తిగత కారణాలతో సంస్థ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2019లో తిరిగి విధుల్లో చేరారు.
Principal Correspondent
2005లో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టాను. 2006 నుంచి 2015 వరకూ ఈటీవీ 2, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానళ్లలో సీనియర్ రిపోర్టర్/కాపీ ఎడిటర్ గా పనిచేశాను. తర్వాత 2018 వరకూ విజయవాడలో ఏపీ 24x7 ఛానల్లో సీనియర్ సబ్ ఎడిటర్ గా, షిఫ్ట్ ఇన్ చార్జ్ గా బాధ్యతలు నిర్వహించాను. తిరిగి 2019 నుంచి 2020 ఫిబ్రవరి వరకూ నెట్ వర్క్ 18/ న్యూస్ 18 అమరావతి కరెస్పాండెంట్ గా పనిచేశాను. 2020 మార్చి నుంచి one india తెలుగు తరఫున అమరావతిలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
కరస్పాండెంట్
క్రిష్ణ హరి మే 2018 నుంచి ODMPLలో కరస్పాండెంట్‌గా పని చేస్తున్నారు. 2000 లో జర్నలిస్టుగా కెరీర్‌‌ను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రాజకీయ పరిణామాలను ప్రత్యక్షంగా కవర్ చేసిన అనుభవం ఉంది. ఎంతోమంది రాజకీయ నేతలను లైవ్ ఇంటర్వూలు చేసిన అనుభవం కూడా ఉంది.
Editor
I am Working for Filmibeat as a senior film journalist. Worked in Gemini Television, Vaarta, TV9, Sakshi, Namasthe Telangana. I have attended film Festivals, Seminars.
Goodreturns Staff Desk Covers global breaking Business and Finance Related news and events. Follow all the latest business news from India, trending and breaking business news updates across the globe, live share market news today, stocks, IPO, finance, economy, crypto stories, Personal Finance, Sucess and Motivational Stories on Goodreturns Staff Desk.
హాయ్‌.. నాపేరు గ‌రిక‌పాటి రాజేష్‌. ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో రిపోర్ట‌ర్‌గా జ‌ర్న‌లిజంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. ఆ త‌ర్వాత ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్లో రిపోర్ట‌ర్‌గా కూడా ప‌నిచేశాను. ఆంధ్రా యూనివ‌ర్సిటీ నుంచి ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, పొలిటిక‌ల్ సైన్స్ లో ఎంఏ, పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం నుంచి మాస్ క‌మ్యూనికేష‌న్‌లో పీజీ చేశాను. రాష్ట్ర‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ రాజ‌కీయాలు, వాటిని విశ్లేషించ‌డం, ఒక్క రాజ‌కీయం అనే కాకుండా ఆధ్యాత్మికం, బిజినెస్‌, సినిమా, క్రీడ‌లు.. అన్నిరంగాల‌కు సంబంధించిన వార్త‌లు రాయ‌డం నా బ‌లం. ప్ర‌స్తుతం వ‌న్ ఇండియా తెలుగు (ODMP) లో స‌బ్ ఎడిట‌ర్ గా విధులు నిర్వ‌హిస్తున్నాను.